సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత చరిత్రకు చిహ్నాలు ఛాయాచిత్రాలేనని, కెమెరా సృష్టికర్త లూయిస్ డాకురే కెమెరా కనుగొనకపోతే చరిత్రకు చిహ్నాలు లేవని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద శ్రీవిజ్ఞానవేదిక, భీమవరం ఏరియా ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి ఫోటోగ్రఫి ప్రాముఖ్యత సంతరించుకుందని, కెమెరా లేని భవిష్యత్ సమాజానికి చరిత్ర తెలియదని అన్నారు. భీమవరం ఏరియా ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కు ప్రభుత్వం ద్వారా నా పరిధిలో సహకారాలు అందిస్తామని అన్నారు. అసోసియేషన్ సభ్యులు రామాయణం శివ, ఘంట చంటి, ఘంట గణేష్, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి శుభకార్యానికి అన్ని వర్గాల వారికి ఫోటోగ్రాఫర్లు అవసరమని, ఫోటోగ్రాఫర్స్ జీవితాలు మాత్రం అస్తవ్యస్థంగా ఉన్నాయని, ఫోటోగ్రాఫర్స్ లకు బ్యాంక్ ల ద్వారా రుణాలు అందించాలని కోరారు. అనంతరం 14 మంది సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫోటో గ్రాపర్లు ముక్కు సింహాద్రి, ఎస్ నాగు, శ్రీమన్నారాయణ, చెక్కు శ్రీరామమూర్తి, బాపిరాజు, కృష్ణంరాజు, బుజ్జి, అరసవల్లి సుబ్రమణ్యం, యర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *