సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI)’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN) ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువతి జాహ్నవి డాంగేటి (23) గురువారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.తన భవిష్యత్తు ప్రణాళికలను ఆయనకు వివరించారు 2022లో పోలాండ్లోని క్రాకోవ్లో ఉన్న అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ (AATC)లో చిన్న వయసులోనే విదేశీ అనలాగ్ ఆస్ట్రోనాట్గా, మొదటి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.ఆమెను శాలువాతో సత్కరించి ప్రతిభ, కృషిని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అభినందించారు. జాహ్నవి లాంటి యువత భారతదేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. జాహ్నవి భవిష్యత్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సహకారం వ్యక్తిగతంగానూ, కేంద్ర ప్రభుత్వం తరపున అందిస్తాం అని ఆమెకు హామీ ఇచ్చారు. ఇది దేశంలో అంతరిక్ష పరిశోధనల పట్ల మరింత ఆసక్తిని పెంచుతుందని శ్రీనివాస వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
