సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం అమావాస్య సందర్భంగా..శ్రీ అమ్మవారి భక్తులకు సుఖశాంతులు కలగాలని , లోక కళ్యాణార్ధం ఆలయ అర్చకులు వేద పండితులు చండి హోమం ఘనంగా నిర్వహించారు. 53 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. నేడు, పశ్చిమ గోదావరి జిల్లా కోర్ట్ జడ్జి శ్రీదేవి గారు కూడా ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారిని దర్శించుకొని చండి హోమం లో పాల్గొన్నారు.
