సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తల్లిని బూతు పదజాలంతో విమర్శించిన ఆరోపణలపై MLAదగ్గుపాటి ప్రసాద్ ను టీడీపీ నుండి సస్పెండ్ చెయ్యాలని , లేకపోతె ఆ ఎమ్మెల్యేను వదిలిపెట్టం అని హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఇచ్చిన గడువు ముగియడంతో నేడు, ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్నితెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం టీడీపీ కార్యాలయం వద్ద కూడా పోలీస్ భధ్రత పెంచారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిణామాలు ఫై ఇప్పటివరకు జూ ఎన్టీఆర్ ఒక్క మాట మాట్లాడకపోవడం టీడీపీ అధిష్టానంఫై కూడా ఆయన ఆగ్రహం పరోక్షంగా ప్రకటిస్తున్నారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *