సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్యాంక్ కాలనీలోని మైత్రి కాలనీస్ వెల్పేర్ అండ్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, ఆదివారం ఉచిత వినాయక పత్రిమాలు, వ్రత పూజ పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే కులవృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు ఉపాధి లభిస్తుందన్నారు. మట్టితో తయారు చేసిన వినాయకులతో పర్యావరణానికి ఎంతో మేలని, ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కెమికల్స్ లేని మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించాలని సూచించారు. భగవంతుడు సృష్టించిన సృష్టి ని, నీటిని మనం కలుషితం చేయకుండా మట్టి విగ్రహాల ప్రతిష్ట చేపట్టాలని యువతను, భక్తులను కోరారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. .
