సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం లో విశేష మహిమాన్వితమైన అశ్వత్థ గణపతి సన్నిధిలో గణపతి నవరాత్రులు వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.. విద్యుత్ అలంకరణ, పందిరి నిర్మాణములు.. మరికొన్ని గంటలలో పూర్తి. కానున్నాయి.. విద్యలకు ఆద్యుడైన గణపతిని పర్యావరణ హితమైన గురు సంఖ్యకు ప్రతీక గా ఉండే 5 సంఖ్యకు సంబంధించి 50 అంగుళాలు మట్టి వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితి ఆగస్టు 27 వ తారీఖు బుధవారం ఉదయం 7-30 కి ప్రతిష్టాపన చేస్తున్నారు. ఉత్సవాల ముగింపుగా సెప్టెంబర్ 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిమజ్జనం యాత్ర ప్రారంభం చేయడానికి నిర్ణయించారు.. ఈ సందర్బంగా శ్రీ అమ్మవారి దేవాలయ ఆవరణలో పవిత్రమైన అశ్వత్త వృక్షం నీడలో వేంచేసి ఉన్న మహా గణపతి వద్ద అందరికి శుభం కలగాలని వినాయక నవరాత్రులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహిస్తున్నాము అని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ, మరియు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *