సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఏపీ శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు భీమవరం గునుపూడి లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 2023 లో వచ్చిన జీ.ఓ తో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణం ను నిర్ణయించి కార్యాలయం ఏర్పాటు చేసారని , శాశ్వత నిర్మాణానికి కొత్తగా స్థలం కూడా కేటాయించారని అయితే ఇటీవల జిల్లా పాలనను ఉండి మండలం పెద్దమిరం తరలించ డానికి శతవిధాల ప్రయత్నాలను చేస్తున్నారని, ఆ వార్తలు నిజం అయితే.. అక్కడ 3న్నర ఎకరాల ఇరిగేషన్ పోరంబోకు భూముల్లో కలెక్టరేట్ కార్యాలయ కట్టడాలను ఏవిధంగా నిర్మిస్తారని?, ఇది సుప్రీం కోర్ట్ తీర్పు కు విరుద్ధం అని స్థానిక ఎమ్మెల్యే రఘురామా గమనించాలని .. భీమవరం నుండి కలెక్టరేట్ తరలిపోతే చూస్తూ ఊరుకోం పట్టణంలోని ప్రజా సంఘాలు , రాజకీయ పార్టీలు అన్ని ఏకం అయ్యి ప్రజాపోరాటానికి సిద్ధం గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ద్వజమెత్తారు. ఈ విషయమై మూడుసార్లు 3 పార్టీల నుండి గెలిచిన స్థానిక శాసన సభ్యులు, అంజిబాబు ఏమి మాట్లాడకపోతే ఎలా ? మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని , ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని, జిల్లాలో అందరి ఎమ్మెల్యే లు దీనిపై స్వాందించాలని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికే ఉండి మండలం లో తలపెడుతున్న శంకుస్థాపనలు నిలిపివేయాలని భీమవరం ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన కోరారు
