సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: “శారీరక, మానసిక పరిపక్వత లేకుండా బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇతర ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదువుపై దృష్టి పెట్టాలని, ఎవరైనా బాల్య వివాహం చేసుకుంటున్నారని తెలిస్తే సంబంధిత పోలీసులకు తెలియజేయాలని” భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G.సురేష్ బాబు అన్నారు.ఈనెల 24 నుండి 30 వరకూ బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించుటకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నేడు మంగళవారం స్ధానిక GVR గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు న్యాయమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్), ప్యానల్ న్యాయవాదులు B. సురేష్ కుమార్, N.సుధీర్, P.అంబేద్కర్, మీడియేషన్ న్యాయవాది K.విజయలక్ష్మి, జిల్లా ఇంటర్ విద్యశాఖ అధికారి ప్రభాకరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి D.పుష్పరాణి, ICDS CDPO D.అనిల్ కుమారి, ఆరోగ్య శాఖ MPHA M. విజయ్ కుమార్, ఒన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్, కాలేజీ ప్రిన్సిపాల్ U. రామచంద్రరాజు, పారా లీగల్ వాలంటీర్లు K.చంద్రరావు, P.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *