సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి , ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, బుధవారం మీడియా సమావేశంలో ప్రజలకు శ్రీ వినాయక చవితి శుభ కాంక్షలు తెలియజేసి మట్టి విగ్రహాలను పూజకు వినియోగించి ప్రజలు పకృతి ని పరిరక్షించాలని , విగ్రహాల నిమజ్జనాలను కూడా నిర్దేశించిన కాలువలలో చెయ్యాలని మంచినీటి చెరువులలో చెయ్యవద్దని హితవు పలికారు. ఇక గత రాత్రి భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు చేసిన వ్యాఖ్యలనుద్దేశించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ.. భీమవరంలో కలెక్టర్ కార్యాలయం శాశ్వత భవనాలు గత 3న్నర ఏళ్లుగా నిర్మాణం కాకపోవడం వాస్తవం అని, ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలని, ఇక ఆలస్యం కాకుండా జిల్లా ప్రజలకు అందరికి అనువుగా ఉంటుందని భీమవరం పట్టణానికి కు అతిసమీపంలో ఉన్న పెదమిరం లో నిర్మించాలని తాను స్వయంగా పూనుకొన్నానని, దీనితో మరల కలెక్టరేట్ భవనాలపై కదలిక వచ్చిందని, ప్రజలలో చర్చ మొదలయిందని ప్రభుత్వం లో కదలిక వచ్చిందని అన్నారు. అయితే తనకు మంచి మిత్రులు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కు దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయని తాను అర్ధం చేసుకోగలనని, అయితే ఆయన కలెక్టరేట్ కోసం కొత్తగా ప్రతిపాదిస్తున్న గ్రామాలూ పట్టణానికి సుమారు 8- 11 కిమీ దూరంలో ఉన్నాయని, కలెక్టరేట్ ను భీమవరం నియోజకవర్గము పరిధిలోనే నిర్మించాలని 12 కిమీ దూరంలో ఉన్న వీరవాసరం లో కలెక్టరేట్ ను నిర్మించలేం కదా? అక్కడ నిర్మిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందా? అని ప్రశ్నించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టానని ప్రజల కోసం కలెక్టరేట్ నిర్మాణం కోసం ముందుకు వచ్చానని అందరు గమనించాలన్నారు. ,
