సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై వ్యూహాలు, రాబోయే రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సమావేశంలో సంకల్పించారు. తదుపరి ,విశాఖపట్నం రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన భవంతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు పాల్గొన్నారు. వాటితోపాటు జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *