సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా సుంకాల ప్రభావం ఫారెక్స్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. అమెరికా డాలర్ మారకంలో రూపాయి తొలిసారిగా 88 కన్నా దిగజారింది. గత శుక్రవారం ఉదయం 87.73 వద్ద ప్రారంభమైన రూపాయి త్వరితగతిన దిగజారుతూ ఒక దశలో 88.33 వరకు కూడా పడిపోయింది. చివరికి నష్టాన్ని 51 పైసలకు పరిమితం చేసుకుని 88.09 వద్ద ముగిసింది. ఈ రెండూ జీవితకాల కనిష్ఠ స్థాయిలే.అమెరికా డాలర్ తో పోల్చుకొంటే రూపాయి స్థాయి ఇంత దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశమే. (గత 10 ఏళ్ళు క్రితం డాలర్ తో పోల్చుకొంటే రుపాయి విలువ సుమారుగా 75 రూపాయలు కు కాస్త అటు ఇటు ఉండేది.)
