సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాళ్ళలోని సిరల్లో ఒత్తిడి పెరగడం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయని, వెరికోస్ వెయిన్స్ అనేవి చర్మం ద్వారా కనిపించే అసాధారణంగా విస్తరించిన సిరలని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, జోన్ చైర్మన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ,క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు అన్నారు. నేడు, ఆదివారం భీమవరం త్యాగరాజ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెరికోస్ వేయిన్స్ (ఉబ్బిన సిరలు) ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్ శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని, కాళ్ళ సిరల్లో ఒత్తిడి పెరగడం వల్ల ఒక వ్యక్తి బరువుగా, అలసిపోయి, నీరసించిపోయేలా చేస్తుందన్నారు. అవి నొప్పి లేదా ఇతర లక్షణాలను కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చునని, ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలని అన్నారు. డా లావణ్య మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్ ఉంటే చికిత్స చేయకపోతే చర్మం విరిగి పుండుగా ఏర్పడుతుందనిదన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, ట్రెజరర్ కనకర్గ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వేయిన్స్ కాళ్లు వాపు, మంట, దురద, కాళ్లలో రంగు మారటం, నరాలు ఉబ్బటం, కాళ్లలో పుండ్లు ఏర్పడడం, బరువెక్కడం వంటి సమస్యల పై పలువురికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారని, ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *