సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులోని రామాలయం వద్ద నేడు, సోమవారం రాక్ స్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక చవితి అన్న సమారాధన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. అన్నిదానాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భక్తిశ్రద్ధలతో వినాయకునికి పూజలు చేసి అన్న సమారాధనలు నిర్వహించడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, పత్తి హరివర్ధన్, యర్రంశెట్టి శివకృష్ణ, పడమటి రామకృష్ణ, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని, గణేష్, రాక్ స్టార్ సభ్యులు పాల్గొన్నారు. అదే విధంగా బలుసుమూడిలో లక్ష్మీ గణపతి యూత్ అధ్వర్యంలో వినాయక చవితి 6వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధన ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *