సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భముగా ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా ఓజి సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 ను ను ప్రకటిస్తూ తాజా పోస్టర్ ను రిలీజ్ చేసారు. మరో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఓజీ’ (OG) సినిమా నుండి వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ను అభిమానులు ఎంతో ఇష్టపడుతున్నారు. రన్ రాజా రన్ మరియు 450 కోట్లు వసూళ్లు సాధించిన ప్రభాస్ ‘సాహో‘ వంటి హిట్స్ ఇచ్చిన స్టైలిష్ సినిమాల దర్శకుడు సుజీత్ , నిర్మాత డీవీవీ దానయ్య లు పవన్ అభిమానుల అంచనాలకు తగ్గని విధంగా ఓజీ ని సిద్ధం చేసారని ఇండ్రస్టీ లో టాక్. వీటిని విడుదల చేస్తున్నారనిపిస్తోంది. నిజానికి ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు కూడా అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ గురించే. ఓజీ సినిమా ముందు వచ్చి ఉంటె హరిహర వీరమల్లు సినిమా క్వాలిటీ తో తీసి రిలీజ్ చేసి ఉంటె బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కలెక్షన్స్ కధ మరో రకంగా ఉంటుందని పవన్ అభిమానులు భావిస్తుంటారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి సంబంధించిన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *