సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి దేవేరులకు జరిపే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వయంగా సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడే శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాలు జరిగీ తొమ్మిది రోజులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు , సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. ఈ ఉత్సవాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు లక్షలాదిగా తరలి వస్తారు. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *