సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయువ్య బంగాళాఖాతంలో తాజగా మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు అధికారులు. నేటి బుధవారం సాయంత్రం నుండి శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
