సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని .. ఇదిలా ఉండగా ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్లకుపైబడి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేసారు.తమ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఇకనైనా చర్యలు తీసుకోకపోతే త్వరలో జరిగే ఏపీజేఏసీ రాష్ట్రస్థాయి సమావేశంలో అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
