సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం రాత్రి 9 గంటల నుండి నుండి ఒంటిగంట వరకు చంద్రగ్రహణం ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను (Temples) మూసివేయనున్నారు. తిరిగి రేపు (సోమవారం) దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు(సోమవారం) ఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నారు. 6 గంటల నుండి దర్శనాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అలాగే, అన్నదానం, లడ్డూ ప్రసాద కేంద్రాలను కూడా మూసివేయనున్నారు. ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూలైనులోకి వెళ్లకుండా నిలిపివేశారు. నేటి మధ్యాహ్నం నుండి తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు మూసివేసి రేపు సోమవారం ఉదయం సంప్రోక్షణ తరువాత అర్చకులు. పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీకాళ హస్తి లో మాత్రం దేవాలయం మూసివెయ్యరు.
