సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలుతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక, దేశంలో చాల ఆలస్యం అయినప్పటికీ జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు దేశ అభివృద్ధికి సహకరిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో కొనసాగుతున్నాయి గత సోమవారం ముగింపు (80, 787)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 350 పాయింట్లు లాభపడి 81 వేల మార్క్‌ను కూడాదాటేసింది. నేటి ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 80, 978 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 24, 827 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో చుస్తే రూపాయి మారకం విలువ 88.07గా ఉంది.
