సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అని, గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో సుమారు రూ 18 లక్షలతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నేడు, మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. రూ 18 లక్షలతో అధునాతనమైన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఈ గ్రామాల్లోనూ సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే మంచినీటి సమస్యను తీరుస్తామని, రెండు ప్రధాన రహదారులకు రోడ్లు వేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,, పంచాయతీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
