సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేపాల్ లో ప్రజలు తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశం సైన్యం చేతులలోకి వెళ్లటంతో వారి డిమాండ్ మేరకు ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z)యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు తీవ్ర స్థాయికి చేరటం పోలీసులు, సైన్యం చేతిలో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు, దీనితో దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రధాని ఓలి అధికారం నుంచి తప్పుకోకతప్పలేదు. ఓలి దుబాయ్‌కు పారిపోవాలని ఏర్పాట్లు చేసుకొన్నారు. పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేసారు. మరోపక్క దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, సైన్య మోహరింపు మధ్య పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.సరిహద్దు దేశం గా భారత్ నేపాల్ పరిస్థితులను గమనిస్తుంది.
