సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం, జగన్ నేడు, బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏడాది తరువాత సూపర్ సిక్స్ అమలు చేశామని సభలు ఏర్పాటు చేసుకోవడం హాస్యస్వాదం అని అవి నిజంగా అమలు అయ్యాయో బోగస్ హామీలుగా మిగిలాయి ప్రజలకు మహిళలకు రైతులకు తెలుసునని .. గత 15 నెలలుగా రాష్ట్రము అంతా కూటమి నేతల అవినీతి చేసి ప్రజలను అప్పులు పాలు చేసి వదిలారని విమర్శించారు. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అన్ని కలపి మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అని గుర్తు చేశారు. చంద్రబాబు మూడుసార్లు సీఎం గా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారం లోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం .. ఒక్కో మెడికల్ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చు తో ఏర్పాటు చేశాం .. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట.. పేద మధ్యతరగతి విద్యార్థులకు చేస్తున్న ద్రోహమే.. అని వైఎస్ జగన్ విమర్శించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎం ల కు బదులు బ్యాలెట్ పద్దతి ఉపయోగిస్తే మరి మంచిదని జగన్ అన్నారు. అసలు, సొల్యూషన్ ఈవీఎం లది కాదు .. రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ అయినా ఈవీఎం లైనా చంద్రబాబు ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు ముందు నిర్వహిస్తే ఒకే రకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు
