సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తాజాగా నేడు, గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రస్తుత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు రేపు (శుక్రవారం) ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (CP Radhakrishnan).ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలవగా రాధాకృష్ణన్‌కు అనుకూలంగా 452 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 781 ఎంపీల్లో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *