సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ( నిజానికి నేడు రిలీజ్ అయిన మిరాయ్, కిష్కింద పురి సినిమాలు నిన్ననే చాల ప్రీమియర్ షోలు పడటంతో చాలామంది చూసేసారు. రివ్యూలు కూడా వచ్చేసాయి.మిరాయి సూపర్ హిట్ టాక్ సాధించింది ). హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, మకరంద దేశపాండే, సుదర్శన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కిష్కింధపురి కథ విషయానికొస్తే.. రాఘవ్(బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ పరమేశ్వరన్), మరో వ్యక్తి(సుదర్శన్) కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ అని చేస్తూ ఉంటారు. దయ్యాలు, వాటి కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమందిని పాడుబడిన బంగ్లాలకు తీసుకెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నట్టు ముందే వీళ్ళే సెటప్ చేసుకొని వీళ్ళతో వచ్చిన వాళ్లందరికీ అక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నట్టు నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనుకోకుండా కిష్కింధపురి దగ్గర్లో ఉన్న సువర్ణమయ రేడియో స్టేషన్ కి వీళ్ళు ప్లాన్, ప్రిపరేషన్ లేకుండా వెళ్లాల్సి వస్తుంది.అక్కడ వారికీ దయ్యాలు ఉన్నట్టు వీళ్లకు జరిగే భయానక సంఘటనలు ఈ సినిమా కధ .. ఇక సినిమా విశ్లేషణ చుస్తే ..సరైన హిట్ కోసం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటం, అనుపమతో కలిసి ‘రాక్షసుడు’ తరువాత మళ్ళీ ఓ మోస్తరు హిట్ కొట్టినట్లే అనిపిస్తుంది. వారి పరిధి వరకు ప్రేక్షకులను బాగానే భయపెట్టారు. అయితే , మొదట హీరో ఎలివేషన్ కోసం పెట్టిన సీన్స్ రొటీన్ అనిపిస్తాయి. CGI వర్క్స్ కూడా ఇంకా క్వాలిటీ తో చేసి ఉండవలసింది.అయితే సినిమా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రధారులు వరుసగా చనిపోవడం, అక్కడ వచ్చే హారర్ సీన్స్ తో భయపెట్టడమే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు.. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది.. కిష్కింధపురి పార్ట్ 2 కి లీడ్ ఇచ్చి వదిలేయడంతో అసలు కథేంటి అనే కుతూహలంతో బయటకు వస్తారు.
