సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో చంద్రబాబు సర్కార్ మద్యం బార్ల లైసెన్స్‌ల కోసం ఇప్పటివరకు రెండు సార్లు గడువు పెంచినప్పటికీ.. తగిన స్థాయిలో స్వాందన లేక దరఖాస్తులు రాకపోవడంతో, ముచ్చటగా మూడవసారి కూడా లైసెన్స్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం మొత్తం 840 బార్ల లైసెన్స్‌ ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కేవలం 412 లైసెన్స్‌లు మాత్రమే ఖరారయ్యాయి. దీనితో మిగిలిన బార్లకు కొత్త నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక సెప్టెంబర్ 18న లాటరీ విధానం ద్వారా లైసెన్స్‌ లను మంజూరు చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *