సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్రా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2వేల 500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ పధకం క్రింద అందించే ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయినా ప్రభుత్వం తమకు హామీలు ప్రకారం డబ్బు బకాయిలు చెల్లిచడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాపోయింది. బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది.
