సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వచ్ఛమైన నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది, సురక్షితమైన మంచినీటిని అన్ని పాఠశాలలో అందిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, బుధవారం ఉదయం భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పీవీ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. స్వచ్ఛమైన మంచినీరు ఇది శరీరాన్ని శుభ్ర పరుస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, చర్మాన్ని మెరిసేలా చేస్తుందన్నారు. శుభ్రమైన నీరు తాగడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి పొత్తూరి బాపిరాజు, బుద్దరాజు శ్రీనివాస రాజు, ఇందుకూరి రామలింగరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, తదితర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *