సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా పలు దేశాలను సుంకాల బెదిరింపులుతో పాటు గోబెల్ పరిణామాలు నేపథ్యంలో డాలర్ కు బదులుగా ఇండియాతో సహా పలు దేశాలు బంగారం కొనుగోలు ఎక్కువ చెయ్యడంతో బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నేడు, బుధవారం ఉదయం నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,42,100కి చేరింది.( ఢిల్లీలో ఇంకా . తగ్గుతుంది) మరోవైపు, తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,940 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,100 గా ఉంది.
