సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ లోని అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో జాలర్లకు తాజగా సుమారు 12 కిలోల బరువున్న ‘పులి మచ్చల’ టేకు చేప లభించింది. ఆ తర్వాత మత్స్యకారులు దానిని వేలం పాటకు పెట్టగా,భారీ ధరలకు విక్రయం జరిగిందని తెలుస్తుంది. ఈ అరుదైన టేకు చేప ఎక్కడో ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్రా నది పరిసర అసోం, అరుణాచలప్రదేశ్ తీర ప్రాంత సముద్రాల్లో అరుదుగా కనిపిస్తుంది. ఈ చేప పొట్ట భాగంలోని బ్లాడర్‌లో ఔషధ గుణాలు ఉండటం వల్ల మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇది రేప్ ఫిష్‌గా గుర్తించబడింది. అటువంటి చేప నరసాపురం సమీపంలోని అంతర్వేది పల్లిపాలెం సముద్ర జలాల్లో దొరకటంతో స్థానిక మత్సకారుల సైతం ఆక్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *