సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్ గత 2 రోజులుగా లాభాల బాటలోనే కొనసాగుతుంది. అయితే నేడు, బుధవారం (సెప్టెంబర్ 17న) మరింత జోష్ లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా పోటాపోటీగా సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ లో జరుగుతున్నా తాజా చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది. ఈ ఉత్సాహంలో నిఫ్టీ మొదటిసారి జూలై 11 తర్వాత 25,300 మార్క్‌ని అధిగమించింది. ఇప్పుడు అందరి దృష్టి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రిజల్ట్‌పై ఉంది.ఈ నేపథ్యంలో నేటి బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 253.74 పాయింట్లు (0.31%) పెరిగి 82,634.43 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 83 పాయింట్లు (0.31%) పుంజుకుని 25,322.10కి చేరింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా ఈ జోష్‌లో పరిగెడుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు 0.3% వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో నిఫ్టీ 25,400, సెన్సెక్స్ 82,800 లేదా 25,500/83,100 స్థాయిలకు కూడా చేరొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *