సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం లోని గునుపూడి, శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని నియమిస్తూ ప్రభుత్వం నేడు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా చింతలపాటి బంగార్రాజు, బి సత్యప్రసాద్, బి. కృష్ణవేణి, పి. లీల, పి. వెంకట రామకృష్ణ, సాయి నాగేంద్ర విజయలక్ష్మి కుమారి, వై. రమేష్, బి. రమణ, పి. శ్యామ్ కుమార్, పి. జ్యోతిర్మయి, కె. విజయకుమార్, అర్చకులు కందుకూరి సోమేశ్వరరావు ఎక్స్ అఫీషియో నియమిస్తూ దేవదాయ శాఖ అధికారులకు ఉత్తర్వులు పంపించారు. రెండు సంవత్సరాల కాలపరిమితితో ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ చింతలపాటి బాపిరాజును ఎన్నుకోనున్నారు. ఈ సందర్భముగా స్థానిక ఎమ్మెల్యే,పులపర్తి అంజిబాబు కు ట్రస్ట్ బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *