సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assemby ) రెండవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేతలు బకాయిలపై ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అడిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు. ఆసుపత్రులకు వందల కోట్ల బకాయిలు నిజమేనని చర్చలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 457 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 13 లక్షల 42వేల మంది అంటే 90 వేల మంది అధికంగా లబ్ది పొందారన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని… దీని వల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వం మార్కు అని ఒక రెగ్యూలేషన్‌తో 40 శాతం వెనెక్కి తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నిధులును ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేటు ఆసుపత్రులకు దారాదత్తం చేశారన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు అడ్జక్ష స్థానంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతున్నప్పుడు సభలో అందరు ఒకేసారి మాట్లాడటం తో రఘురామా అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వ విప్ లు అసెంబ్లీ ని కంట్రోల్ లో పెట్టాలని మీరే ఇలా వ్యవహరిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వైద్య సేవపై, వేల కోట్ల బకాయిలు ఫై కొన్ని పత్రికలు విశేషంగా వార్తలు రాస్తున్నాయని.. వాటిపై మంత్రి సత్యప్రసాద్ మరింత క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *