సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కి రాజీనామా చేసిన సుదీర్ఘ నిరక్షణ తరువాత ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు నేడు, శనివారం టీడీపీలో చేరారు.ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ పార్టీ ఫిరాయింపు నేతలకు ఆహ్వానం పలికారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పారు. ఈ పార్టీ ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్సీ లు మీడియాతో మాట్లాడుతూ.. తాము 6 నెలల క్రితమే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినప్పటికీ.. వాటిని ఇప్పటివరకు చైర్మెన్ మోషేను రాజు ఆమోదించలేదని వారు తెలిపారు. తమ రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని, అందుకే తాము టీడీపీలో చేరామని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు కావాలని టీడీపీలో చేరామని వారు తెలిపారు
