సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ మెగా ప్యాన్స్ అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్ర ఓజీ టి షర్ట్స్ లను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈనెల 25వ తేదీన ఓజి చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుందని, పవన్ కళ్యాణ్ చిత్రమంటే అభిమానులకు పండుగ అని, ఈ చిత్రం విజయం సాధించి ఒక మైలురాయిని సాధిస్తుందని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులకు ఓజి టి షర్ట్స్ లను అందించారు. కార్యక్రమంలో పట్టణ మెగా ప్యాన్స్ అధ్యక్షులు చల్లా రాము, కొప్పినిడి బాబీ, వలవల ఫణి, కొప్పర్తి కోటి, యాతం స్వామి, యర్రంశెట్టి శ్రీను, రావూరి ప్రసాద్, తోట శేషు, లతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. అయితే పవన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన OG ట్రైలర్ వాయిదా పడటం తో కాస్త నిరాశ పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *