సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో.. రేపటి సోమవారం నుండి వైభవంగా ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలు ఘనంగా జరగడానికి.. ఎటువంటి అవరోధాలు లేకుండా నలువైపులా దోషాలు తొలగించి నిర్విఘ్నంగా భక్తులు అందరికి శుభాలు చేకూర్చేలా… నేడు ఆదివారం మధ్యాహ్నం.. శోభ యాత్ర.. ప్రత్యేక వాహనం ముందు శ్రీ గణేష్ తో పాటు దేవి దేవత మూర్తుల విగ్రహాలతో కూడిన రధం ముందు కదలగా భీమవరం పురవీధులగుండా వందలాది మహిళలు నీటి కలశాలతో వెంట రాగ సంప్రదాయ బద్దంగా శ్రీ మావుళ్ళమ్మ శోభాయాత్ర మోటుపల్లి వీధిలోని శ్రీ మావుళ్ళమ్మవారి పూరి గుడి నుండి ప్రారంభమై భీమేశ్వర స్వామి దేవస్థానం, పొట్టి శ్రీరాములు, తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఆలయం వరకు శోభ యాత్ర జరిగింది. అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అద్వర్యం లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు శ్రీ అమ్మవారిని దర్శించుకొని అస్సిసులతో పాటు ప్రసాదాలు స్వీకరించారు.
