సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ అభిమానులను యోగి పీవర్ పట్టుకొంది. 1980 దశకానికి చెందిన పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న OG కన్సర్ట్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఆ టీజర్ లో లుక్స్ OG గా పవన్ చెలరేగిపోయారని చెప్పకనే చెపుతున్నాయి.ఓజస్ గంభీర కేరక్టర్‌లో కనిపించనున్న పవర్‌స్టార్ పవన్ ఈవెంట్‌లో గతానికి బిన్నంగా వింటేజ్ లుక్‌లో మంచి హడావిడి చేసి అభిమానులను అలరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. ఏ వర్షమూ మనల్ని ఆపలేదు… ఏ ఓటమి మనల్ని వెనక్కి నెట్టలేదంటూ కాస్త పొలిటికల్ టచ్ ఇస్తూ డైలాగులు విసిరారు. తనకు సినిమాలు రాజకీయాలు వేరన్న పవన్… సినిమాలు చేస్తున్నప్పుడు కేవలం సినిమాల గురించే ఆలోచిస్తానన్నారు. ఇటు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప మరో ఆలోచన ఉండన్నారు. అభిమానుల కేరింతల మధ్య ఓజీ కన్సర్ట్‌లో కత్తి పట్టిన పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.తాను ఓ డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయానన్నారు. OG సినిమా అభిమానుల అంచనాలను దాహార్తిని తీరుస్తుందన్నారు.
