సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో తాజగా జరుగుతున్నా ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా జరుగుతున్నా వివిధ దేశాల నేతలు పాల్గొన్న 80 వ వార్షిక సమావేశంలో భారత్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్ తరపున మంత్రి జై శంకర్ హాజరు అయ్యారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను భారత్ పాక్ యుద్ధంతో సహా 7 యుద్దాలు అపానని ..అయితే రష్యా ఉక్రెయిన్ ఫై జరుపుతున్న ఆక్రమణ దాడికి పరోక్షంగా రష్యా దగ్గర చైనా, భారత్ ఆయిల్ కొని నిధులు ఇచ్చి సహకరిస్తున్నాయని, ఆరోపించారు. అంతటితో ఆగకుండా NATO మిత్రదేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని వారిపై కూడా అదనపు పన్నులు వేస్తామని హెచ్చరించారు. . అయితే ఎవరు ఊహించని విధంగా తాజాగా దానిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌ను సమర్థిస్తూ.. ఇండియా తమవైపే ఉందని స్పష్టం చేశారు. రష్యా తో యుద్ధం ఆపడానికి తన వంతు సహకారం కు ముందుకు వచ్చిందని, అంతేకాకుండా భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, ఐరోపా దేశాలు భారత్‌తో సంబంధాలను మరింత పెంచుకోవాలని ఆయన హితవు పలికారు. దీనితో భారత్ ను అల్లరి చేస్తున్న ట్రంప్ గొంతులో పచ్చి వెలగకాయ్ పడినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *