సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా సోదరుడు కొణిదల నాగబాబు ఇటీవల శాసనమండలికి ఎన్నికయిన విషయం అందరికి తెలిసిందే.. ఆయన ప్రస్తుతం రోజువారి సమావేశాలకు కూడా హాజరు అవుతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో నేటి బుధవారం ఉదయం రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు ను సమావేశాలకు ముందు ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలసి డ్రై ఫ్రూట్స్ పాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సభ ను బాగా అవగాహన చేసుకొని ప్రజల సమస్యలపై సమర్ధవంతంగా చర్చించాలని ఎమ్మెల్సీ గా నాగబాబు రాణించాలని మోషేను రాజు అభినందించారు.
