సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమలలో ఒక ఉద్యోగి అసభ్య ప్రవర్తనకు దెబ్బలు తినడం తో పాటు ఉద్యోగం కోల్పోయిన ఘటన ఇటీవల జరిగింది. వార్త సమాచారం మేరకు..విషయంలోకి వెళ్ళితే విశాఖపట్నంకు చెందిన ఓ కుటుంబం గత సోమవారం సాయంత్రం చిన వెంకన్న దర్శనం కోసం ద్వారకాతిరుమల వచ్చారు. వారు టీటీడీ సదనంలో గది అద్దెకు తీసుకున్నారు. సత్రంలో గుమస్తాగా పనిచేస్తున్న నారాయణ అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వారితో అతి చనువుగా మాటలు కలుపుతూ.. ఆ కుటుంబంలోని ఓ మహిళకు జ్వరం రావడంతో, నిన్న మంగళవారం రోజు విధులకు వచ్చిన ఉద్యోగి ఆమెను పలకరించాడు. “జ్వరం తగ్గిందా?” అంటూ చొరవగా ఆమె చేయి పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆమె, ఉద్యోగిని లాగి కొట్టారు.. ఆ తరువాత ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడిని కొట్టి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు, ఉద్యోగి చేయి పట్టుకున్నది నిజమేనని నిర్ధారించారు. ఈవో ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి వెంటనే స్పందించి, ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఆలయంలో గదులకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఓ ఉద్యోగిని సస్పెండ్ చేయగా.. తాజాగా ఈ ఘటన చర్చనీయాశం అయ్యింది.
