సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు లో నేడు, బుధవారం స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు, స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి లోకేష్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రివర్గం తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తరలి వచ్చి వదువరులను ఆసిర్వదించడం జరిగింది. మంత్రి నిమ్మల ఈ శుభ సమయంలో కూడా సాంప్రదాయ దుస్తులకు బదులు టీడీపీ పార్టీకి విధేయతగా పసుపు చొక్కా ధరించడం కూటమి నేతలను విస్మయపరిచింది. పాలకొల్లు పట్టణం అంతటా ప్రముఖులు రాకతో సంబరాలుతో పాటు పోలీస్ భద్రతా వలయాలు మోహరించి ఉన్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లతో సేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో మరి నేటి సాయంత్రం వరకు అతిధులు హాజరు అవుతూనే ఉన్నారు. భీమవరం నుండి విశేషంగా రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *