సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రవేటు హాస్పటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలుపుదల ఆందోళనలు మొదలు. విద్యుత్తూ ఉద్యోగులు ఆందోళనలు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో (మాజీ సీఎం జగన్ హయాం ) నుండి నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలు ( ఇప్పటికే 6 కాలేజీలు పూర్తీ అయ్యి కోర్సులు జరుగుతున్నాయి. మరికొన్ని నిర్మాణాలు పూర్తీ చేసుకొంటున్నాయి.) ను పీపీపీ లపేరుతో చంద్రబాబు సర్కార్, ప్రవేటు పరం చేసి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులను వైద్య విద్యకు దూరం చెయ్యవద్దని ప్రతిపక్ష వైసీపీతో పాటు పలు ప్రజా సంఘాలు ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తుంటే.. మరో పక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దసరా పర్వదినాలు పూర్తీ అయ్యాక వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. మరోప్రక్క, విద్యార్థులకు ప్రెవేటు పీజు డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వము చెల్లించవలసిన పీజులు బకాయిలు ఫై కూడా ప్రెవేటు డిగ్రీ కాలేజీల మూసివేత ఉద్యమం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా విజయవాడ ఎన్జీవో హోంలో నేడు, బుధవారం ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ దసరాకు నాలుగు డీఏ బకాయిల్లో కనీసం రెండైనా ప్రకటించి, ఉద్యోగుల కు ఇవ్వవలసిన PRCఫై కమిటీ వెయ్యాలని, ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరారు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ మీనమేషాలు లెక్కిస్తే ఇక పోరాటాలకు ఉద్యొగులు సిద్ధంగా ఉన్నారని దీనికి దసరా తరువాత కార్యాచరణ జరుగుతుందని పిలుపు నిచ్చారు.
