సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 4వ రోజు కూడా నష్టాలలో కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బాగా బలహీనపడి ఒక్క డాలర్కు సుమారు 90 రూపాయలు( తాజగా మారకం విలువ 88.64గా ఉంది ) చెల్లించవలసి రావడం ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్‌లో ఉన్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించడం దేశీయ సూచీలు క్రిందికి దిగిపోతున్నాయి. .గత బుధవారం ముగింపు (81, 715)తో పోల్చుకుంటే నేటి గురువారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10:40 గంటల సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 81, 529 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 51 పాయింట్ల నష్టంతో 25, 004 వద్ద కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *