సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సందడి మాములుగా లేదు. ప్రధాన సెంటర్స్ లో భారీ ఫ్లెక్సీ ల సందడి అభిమానుల కోలాహలం మధ్య గత బుధవారం రాత్రి 10 గంటల నుండి నేటి గురువారం ఉదయం వరకు 9 థియేటర్స్ లో షో లు పడుతూనే ఉన్నాయి. నేటి మధ్యాహ్నం వరకు అన్ని షోస్ హోసే ఫుల్.. ఇప్పటి వరకు పవన్ సినిమాలలో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. గత రాత్రి 10 గంటలకు 9 థియేటర్స్ లో ప్రీమియర్ షోలలో స్థానిక మల్టి ఫ్లెక్స్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జిల్లా కలెక్టర్ నాగరాణి , పలువురు కూటమి నేతలు సినిమాను అభిమానుల ఆనందోత్సవాల మధ్య వీక్షించారు. తదుపరి తేదుపరి ఒంటిగంటకు మరో 9 షోలు, తదుపరి తెల్లవారు జాము 4న్నర గంటలకు 7 థియేటర్స్ లో షోలు వెయ్యడం నేటి గురువారం రాత్రి వరకు 9 థియేటర్స్ లో ఇదే దూకుడు కొనసాగే అవకాశం ఉంది. కలెక్షన్స్ మోత మోగనుంది.
