సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త, మహనీయులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని భీమవరంలోని జిల్లా బిజెపి కార్యాలయంలో నేడు, గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరై పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్‌ను డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి స్థాపించిన వారిలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ముఖ్యులు అని కొనియాడారు. ఆయన 15 సంవత్సరాల పాటు జనసంఘ్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. బిజెపికి పునాదిగా నిలిచిన సిద్ధాంతాలు, విలువలు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వే అని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరాలనే “అంత్యోదయ సిద్ధాంతం” పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పేర్కొన్నవే అని తెలిపారు.
