సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు (గతంలో చిరంజీవి హీరోలతో పాటు అప్పటి సీఎం జగన్ ను కల్సిన నేపథ్యంఫై).. ‘సైకో’గాడు పిలిచాడని ‘ఎవడో ‘వెళ్లి అక్కడ చేసింది ఏమి లేదని, “కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే .. అన్నది అబద్ధం. గట్టిగా ‘ఎవడు’ అడగలేదు అక్కడ” అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. అంటూ అటు జగన్ తో పాటు చిరంజీవి ని వ్యంగంగా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అదే సభలో ఉండే చంద్రబాబు గాని, పవన్ కానీ బాలయ్యను వారించక పోవడం ఫై అటు వైసీపీ తో పాటు మెగాస్టార్ చిరు అభిమానులలో ఆగ్రహం పెల్లుబికింది. దీనిపై విదేశాలలో ఉన్న చిరంజీవి ఘాటుగా స్పందించారు. నిజానికి ‘జగన్ తమను ఎవరిని పిలవలేదని’, తాను అపట్లో మంత్రి పేర్ని నాని కి ఫోన్ చేసి సీఎం గారి అపాయింట్మెంట్ అడిగితె.. ఆయన ప్రేరణతో సీఎం జగన్ తనను సాదరంగా విందుకు ఆహ్వానించగా ఆయనను కల్సి సినీ పరిశ్రమ సమస్యలను వివరించానని, అధికారికంగా సినీ ప్రముఖులతో మరోసారి కలుస్తానని తానే చెప్పానని, కోవిడ్ కారణంగా 5 మంది మాత్రమే రావాలని సీఎంఓ తెలిపిందని, కానీ 10 మందిమి వస్తామని చెప్తే జగన్ గారు సరేనన్నారని చిరు చెప్పారు. బాలకృష్ణకు 3 సారులు ఫోన్ చేయిస్తే అందుబాటులోకి రాలేదని అన్నారు. తాను ఆర్ నారాయణ మూర్తితో సహా ఇతర హీరోలతో వెళ్లానని చెప్పారు. టికెట్ల ధరల పెంపునకు జగన్ సర్కార్ అంగీకరించడం వల్ల అందరికీ మేలు జరిగిందని ఆ నిర్ణయం వల్ల మీ ‘వీరసింహా రెడ్డి’ సినిమాకైనా, నా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను.అంటూ చిరంజీవి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసారు. అయితే గతంలో వేదికలపై పవన్, జగన్ చిరంజీవిని అవమానించారని మాట్లాడినప్పుడు మెగాస్టార్ ఏ కారణం చేతనో స్వాందించక పోవడం అభిమానులకు అర్ధం కానీ విషయం.
