సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ దేవాలయంలో దసరా వేడుకలలో భాగంగా నేడు, శుక్రవారం భక్తులు వేలాదిగా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొన్నారు. శ్రీ మహాలక్ష్మి అలంకరణలో ఉన్న శ్రీఅమ్మవారి దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 12న్నర వరకు మహిళలు భారీ క్యూ లైన్ లలో నిలబడి వేచిఉండటం ఈ దసరా వేడుకలలో ఇదే తొలిసారి.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం వేగంగా జరిగే విధంగా దేవాలయ సిబ్బంది ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
