సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయుగుండం ప్రభావంతో గోదావరి జిల్లాలలో వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో.. నేడు, ఆదివారం ఎండ కాస్తుండటంతో ఊపిరి పిలుచుకొన్న ప్రజలకు గోదావరి జిల్లాల నడుమ ప్రవహించే గోదావరి నది కి మరల వరద ( floods ) పెరగటం ఆందోళన రేకెత్తిస్తుంది. రాజమండ్రి వద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రానికి 45 అడుగులుగా నీటిమట్టం నమోదవగా దిగువకు 10 లక్షల క్యూసెక్కుల నీరురావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరు పాడు, కుక్కునూరు మండలాల్లో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు నీటమునిగిపోవడంతో 23 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో కుక్కునూరు మండలంలో మొత్తం 300 పైగా ఎకరాలలో మిరప పంట మునిగిపోవడంతో రైతుల బాధ అంతాఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీనితో కొవ్వాడ కాలువ నరిల్లు గోదావరిలోకి వెళ్లే మార్గం లేక పంట పొలాలు కు పెను ప్రమాదం పొంచి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *