సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పెరిగిపోయిన విద్యుత్తూ చార్జీల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారుల కు కాస్త ఊరట పొందేలా వచ్చే నవంబర్ నెల నుండి ట్రూడౌన్ తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వచ్చే నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు యూనిట్ కు 13 పైసలు చప్పున తగ్గనున్నాయి. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
