సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకలలో భాగంగా 9వ రోజు నేడు, మంగళవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారు పులి వాహనం ఫై 8 చేతులతో దివ్య ఆయుధాలు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిలువెత్తు శ్రీ అమ్మవారి దర్శన భాగ్యం కోసం వేలాదిగా భక్తులు ఆలయం వద్ద క్యూలు కట్టారు. అయితే గర్భ ఆలయం వద్ద భక్తులను సిబ్బంది తొందర పెట్టడంతో చాల మందికి శ్రీ అమ్మవారిని పరిపూర్ణంగా చూడలేకపోయామనే అసంతృప్తి కనపడింది. నేడు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీ అమ్మవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వీరికి పూజలు జరిపి ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో వీరికి అందజేశారు. అక్టోబర్ 2 తో వేడుకలు ముగియనున్నాయి. అక్టోబర్ 4 వ తేదీన జరిగే భారీ అన్న సమారాధనతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *