సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి జయంతి రోజున.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. నేడు, బుధవారం నుండి అంటే అక్టోబర్ 1 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభం కానుండగా ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 విమానం ద్వారా వారానికి మూడు రోజులు పాటు అంటే మంగళవారం, గురు, శని వారాలు ఈ సర్వీసును అందించనుంది.. కేవలం గంటన్నర లో తిరుమల చేరుకోవచ్చు.. బుకింగ్ లో మొదటి 35 టిక్కెట్లకు రూ.1999, 35 నుంచి 70 టిక్కెట్ల వరకు నాలుగు వేలకే టిక్కెట్ల ధర నిర్ణయించామని కేంద్ర మంత్రి , రామ్మోహన్ నాయుడు తాజగా తెలిపారు. తిరుపతికి మంచి డిమాండ్ ఉందన్నదృష్ట్యా మరో మూడు నెలల వరకు టిక్కెట్లు బుక్కయ్యాయని ఆయన తెలిపారు. ఇటీవల రాజమండ్రి నుంచి ముంబై, ఢిల్లీకి విమాన ప్రయాణికుల సంఖ్యా బాగా పెరిగిందన్నారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ విస్తరిస్తూ నూతన టెర్మినల్ ను ప్రారంభిస్తామని, రాజమండ్రి నుంచి బెంగుళూరుకు మరో విమాన సర్వీసు, వారణాసికి ఇంకొక విమాన సర్వీసు అందుబాటులో తీసుకువస్తామని చెప్పారు.
